జరిగిన కథ


వుద్యోగవేటలో పట్నం చేరిన వెంకటరత్నం, గురు మామయ్య దగ్గర అర్థ ఆర్థిక పాఠాలు నేర్చుకుంటూ వుంటాడు. అందులో భాగంగా మామయ్య రెజ్యూమే తయారు చెయ్యటం, ఆర్థిక మాంద్యం, షేర్లు, స్టాక్ మార్కెట్ పనితీరు, సత్యం కంప్యూటర్స్ భాగోతం, బ్యాంకులు పనిచేసే విధానం, ఇంటర్వ్యూ చిట్కాలు, క్రెడిట్ కార్డుల వివరం చెప్పాడు. వెంకట రత్నానికి వుద్యోగం దొరికింది, మమయ్యకి పెళ్ళి కుదిరింది. జే.ఎఫ్.ఎం విరామం తరువాత మామయ్య కొత్త కథ మొదలు పెట్టాడు. "ఎకనమ దేశంలో సంక్షోభం" కథ ద్వారా ఆర్.బీ.ఐ చేసే పనులు వివరించాడు. ఎలక్షన్ జరిగిన రోజు చంద్రబాబు నగదు బదిలీ గురించి వివరించాడు. ఆ తరువాత పర్సనల్ ఫైనాన్స్ గురించి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పసాగాడు మామయ్య. అందులో మొదటగా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రిస్క్-రివార్డ్‌ల గురించి చెప్పి, ముదుపు చేయడానికి కొన్ని టెక్నిక్‌లు నేర్పించాడు.

14.8.08

పదమూడొవ అధ్యాయం: మరో వూర్లో మారు వేషం

పాండవుల సంపాదనంతా ఏమైందో హన్మంతు చెప్పసాగాడు.

"రాజన్.. పాండవులు కురుక్షేత్ర యుద్ధం చేసి హస్తినాపురం చేరి రాజ్యపాలనం చేస్తున్నారట. కొంతకాలానికి శ్రీకృష్ణుడు పాండవుల రాజ్యానికి వచ్చాడట. చూడగా ఆ రాజ్యంలో అధిక పన్నులు విధిస్తూ, ప్రజల డబ్బు దోచుకుంటూ ప్రభుత్వం నడుస్తున్నట్టు కనపడింది కృష్ణుడికి. నేరుగా ధర్మరాజు దగ్గరకు పోయి.. ఏమిటయ్యా ఇది అని అడిగాడు. ధర్మరాజు కృష్ణున్ని చూడగానే బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు.."


"ఏం ఎందుకూ..??"

"అదే మాట కృష్ణుడు అడిగితే.. బావా.. ఈ రాజ్యం నా వల్ల కాదు బావా.. యుద్ధం అయిన దగ్గర నించీ మా తాతలు, తండ్రులు, తమ్ముళ్ళ నెల మాసికాలు, సంవత్సరీకాలు, తద్దినాలు మా శత సోదర విధవా పోషణం.. వీటికే నా ధనాగారంలో వున్న డబ్బంతా అయిపోతోంది...అంటూ ఏడ్చాడట"

మహారాజు గట్టిగా నవ్వి.. "అందుకే అనుకుంట మన తెలుగులో పాండవుల బీడు అనే జాతీయం పుట్టింది.. అయినా ఇది నాకెందుకు చెప్పినట్లు..?" అని అడిగాడు.

"ఎందుకేమిటి రాజన్.. మీ సంపాదన కూడా అంతేగా.. మూడువందల పన్నేండు మంది భార్యలు.. వారి బంధుగణం.. వారి పోషణ, సంరక్షణ.."

"నిజమే హనుమా.. అందుకే మన ఖజాన తరచుగా నిండుకుంటుంది.."

"అంతే కాదు ప్రభు.. మీ తదనంతరం విధవా పోషణం.. అలా అలా కొన్ని తరాలవరకు..."

"ఆపవయ్యా హనుమా.. విషయం అర్థమైంది.. దీనికి ఏదో ఒక సమాధానం ఆలోచిస్తాలే.." అన్నాడు మహారాజు.

ఇద్దరూ సామంతుడి వూర్లో ప్రవేశించారు.


***

సామంతరాజ్యంలో తిరుగుతుండగా వారికి ఒక భిక్షగాడు తారసపడ్డాడు.
"అయ్యా.. ఒక్క వరహా ధర్మం చెయ్యండి" అని అడుక్కుంటున్నాడు.
"ఎమయ్యా నువ్వెంత అమాయకుడివి.. ఒక్క వరహాతో ఎం చేసుకుంటావు.. మరీ ఒక్క వరహేనా అడిగేది.." అన్నాడు మహరాజు.
"నేను అడిగేది మొహన్ని బట్టి వుంటుందు.. మీ మొహానికి ఇంతే" అన్నాడు వాడు.
"ఎమన్నావ్.. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా..?"
"తెలుసు.. నువ్వు ఈ రాజ్యానికి మహారాజువి.. నీ విలువ అంతే అని తెలుసుకో.." అంటూ వాడు వెళ్ళిపోయాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు.

అక్కడికినుంచి మరికొంతదూరం వెళ్ళినతరువాత ఒక అమ్మాయి తారసపడింది.
"అమ్మాయి.. నన్ను పెళ్ళిచేసుకుంటావా..?" అడిగాడు మహారాజు.. తమాషా ఏమిటంటే ఆ అమ్మాయి కూడా మహారాజును గుర్తుపట్టింది.
"మీలాటి వారు నా పతియే అయితే.. ఇంత విషం కలిపిన సురాపానాన్ని ఇచ్చేదాన్ని.." అన్నది.
దానికి మహారాజు - "హూ.. నీలాంటి పెళ్ళామే వుంటే అ సురని ఆనందంగా తాగేవాడినేమో.." అన్నాడు. ఆ అమ్మాయి విసురుగా వెళ్ళిపోయింది.ఇద్దరూ నవ్వుకుంటూ ముందుకి కదిలారు.

ఆంతలో ఆ అమ్మాయి కత్తితీసి మహారాజు గుండెలకానించింది. ఇంతకు మునుపుతగిలిన బిక్షగాడు విల్లుతీసి హన్మంతుకి గురిపెట్టాడు. శత్రురాజు గరళకంఠవర్మ గుర్రమ్మీద వచ్చి ముందు నిలబడ్డాడు.

"నువ్వా.." అన్నాడు మహారాజు.
"అవున్నేనే.. నీ మారువేషాలూ అన్నీ గమనిస్తూనే వున్నా.. నేటికి నాకు బందీగా దొరికావు.. నీ బాధలనుంచి ప్రజలకి విముక్తి దొరికింది.. ఇక ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది" అన్నాడు గరళకంఠ
"ప్రజాస్వామ్యమంటే..?" అడిగాడు మహారాజు
"ప్రజలే రాజులు.. వారికి అన్ని స్వాతంత్ర్యాలూ వుంటాయి.. వారి మాట వేదవాక్కు.. అవసరమైతే వారు మహారాజు అంటె నన్ను కూడా తిట్టగలగాలి.." అన్నాడు
"దానికి ప్రజస్వామ్యమెందుకు ఇప్పూడూ తిడుతున్నారుగా.." అన్నాడు మహారాజు
గరళకంఠుడు కోపంగా మహారాజు చెంపమీద కొట్టాడు. దానికి మహారాజు సౌమ్యంగా -
"నన్ను కొడితే కొట్టావు.. మా హన్మంతుని కొట్టే సాహసం చెయ్యకు" అన్నాడు. హన్మంతు చెంప కూడా చెళ్ళు మంది.
"అదేమిటి మహారాజా.. అనవసరంగా నా చెంప పగులకొట్టించారు" అన్నాడు హన్మంతు.
"నన్ను ఒక్కణ్ణే కొడితే నువ్వు రాజ్యమంతా చెప్పేస్తావు. నువ్వు తన్నులు తిన్న విషయం చెప్పుకోలేవు కదా.." అన్నడు మహారాజు చెంప నెమురుకుంటూ.

అంతలో ఎక్కడినించి వచ్చారోకాని కొన్ని వందలమంది సైనికులు సేనాని చంద్రమల్లు నెత్రుత్వంలో గరళకంఠుడి మనుషులమీద దాడి చేసారు. శత్రుసైనికులు అంతాపారిపోయారు. మహారాజు క్షేమంగా బయటపడ్డాడు.

"సేనానీ..!! మీకు ఈ విషయం ఎలా తెలిసింది?" అడిగాడు మహారాజు.
"నేనే పిలిపించాను రాజన్.. మొన్నొక గ్రామంలో ఒక వర్తకుడు రాజ్యంలో శత్రువులు వున్న విషయం చెప్పగానే సేనానికి వర్తమానం పంపాను." చెప్పాడు హన్మంతు.
"నా ప్రాణాలు కాపాడావు విదూషకా.."
"ఈ మాట రాజ్యంలో ఎవరితో అనకండి మహారాజా.. అందరు నన్ను తిట్టుకుంటారు.." అన్నాడు హన్మంతు నవ్వుతూ.
"అలాగా.. అయితే మనం రాజధాని చేరగానే నీకు సన్మానం జరిపిస్తాను.. సేనానీ.. ఆ ఏర్పాట్లు చూడమని మహామంత్రికి వర్తమానం పంపించు" అన్నాడు.

అంతా రాజధానికి తిరుగు ప్రయాణం అయ్యారు.

సేనాని చంద్రమల్లు హన్మంతు వైపు అదోరకంగా చూసాడు.

(పధ్నాల్గొవ అధ్యాయం: హన్మంతుకి సన్మానం)


తెలుగువారమండి...



సందర్శకులు

మీరీ బ్లాగుకి కొత్తా..?

నేను గతంలో రాసిన హాస్యదర్బార్ మొదటి నించి చదవాలంటే ఇక్కడ నొక్కండి

కార్పొరేట్ కాశీమజిలీ కథలు మొదటి నించి చదవాలంటే ఇక్కడ నొక్కండి

వీరతాడు..

  © Blogger template Psi by Ourblogtemplates.com 2008

Back to TOP